02 సెప్టెంబర్ 2010

మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!

22 మే 2010, శనివారం రాత్రి సమయం పదయింది. ఆషాకి ఒంట్లో బాగలేదు. డక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకుని, నిద్రపట్టక టీవీ చూస్తుంది. నేను కంప్యూటర్లో పాటలు వింటున్నాను. ఆష గట్టిగా పిలిచింది. ఏమైందో ఏమోనని కంగారుతో వెళితే,

"వేటూరి చనిపోయారంట! ఫ్లాష్ న్యూస్ వస్తోంది" ఆష హీనస్వరంలో చెప్పింది!

అలాగే కిందకు వాలిపోయాను. మాటలు రావడంలేదు. ఇది కల అయితే బాగుండు. నన్నెవరన్నా ఇప్పుడు నిద్రలేపేయండి అని అరవాలనిపించింది! టీవీకేసి చూస్తున్నాను గాని ఆ ఫ్లాష్ న్యూస్ అక్షరాలు కనపడడంలేదు. కన్నులు కమ్మేశాయి. మరో ఛానల్ మార్చింది. అందులోనూ అదే న్యూస్ చదువుతున్నారు. కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంటర్నెట్లో మిత్రులనడిగాను. వారూ అదే వార్తతో బాధపడుతున్నారు.

వేటూరి చనిపోవడం ఏంటి? అసలు అది సాధ్యమా? రాలిపోని పువ్వనుకున్నాను వేటూరిని.

నాకు కాలం స్తంబించింది. కందెన లేకుంటే భూచక్రం ఎలా తిరుగుతుంది? కన్నీళ్ళతోబాటు ఆలోచనలూ అల్లుకుపోతున్నాయ్!  ఇందాకకూడా పాట వింటూ వేటూరికి ఒక శభాష్ చెప్పానే, అయితే నా ఈ "శభాష్"ని అందుకోలేదా అయన? అంతకుముందు "చుక్కూళ్ళోకెక్కినాడు చక్కనోడు..." పాటవింటున్నప్పుడే ఆయణ ప్రాణం పోయుంటుందా? నాలో కన్నీళ్ళూ, ప్రశ్నలూ, ఆలోచనలూ పౌర్ణమి రేయి సాగరతీరంలా ఇంకా ఇంకా పెర్గుతున్నాయ్!

"నువ్వు హైదరబాదుకు వెళ్ళి చూసిరా" ఆష చెప్పింది.
"నీకు బాగలేనప్పుడు ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళను?"
"నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళి చివరిసారిగా చూసిరా. తెల్లవారికి టిక్కేట్లు ఉన్నాయా చూడు" అని ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చింది ఆష.

నా అధృష్టం. ఒకే ఒక 8:45 ఫ్లైట్లో మాత్రం తిక్కెట్లు ఉన్నాయ్. మోహన్‌కి ఫోన్ చేసి చెప్పాను. తనూ వస్తానన్నాడు. రెండు తిక్కెట్లు బుక్ చేశాను. ఆషాకు బాగలేదు, ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి అన్న బాధ, ఇంక కొత్తగా వేటూరి పాటలు ఏవీ రావ్వు అన్న బాధ - అసలు నిద్ర రాలేదు. మనసంతా ఆయన రాసిన విషాద గీతాలు మెదలుతున్నాయ్.
నా చుట్టూ ప్రపంచం నిద్రపోతుంది. నేను మాత్రం మరణాన్నీ, వేటూరినీ నిందిస్తున్నాను! ఆయన భాషలోనే

మదికే అతిధిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనో
ఎదురుచూపుకు నిదరేది - ఊగెను ఉసురే కన్నీరై;
మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!


ఆకలీ, నిద్ర ప్రేమలోపడ్డవారికేకాదు వియోగంలో ఉన్నవారికి కూడా ఉండవేమో. తెల్లవారి అద్ధంలో మొహం చూస్కుంటే నాకే నేను అన్యుడిలా కనపడుతున్నాను. హోసూరుకెళ్ళి మోహన్‌ని  పిక్కప్ చేసుకున్నాను. మాకు ఏం మాట్లాడుకోవాలో తోచలేదు. మౌనంగా రెండుగంటల్లో airport చేరుకున్నాము. కిటికీనుంచి ఆకాశానికేసి చూస్తున్నాను, చనిపోయిన వేటూరి గారు కూడ తారలా మారుంటాడేమోనని. వేటూరి తారగా మారడం ఏంటి? ఆయన తేజోవంతుడు; సూర్యుడౌతాడు గాని, తారకాడు! హైదరబాదులో దిగి, ఆయన నివాసం వెతికి చేరుకున్నాము. ఆయన భౌతికకాయం చూడగానే అంతవరకు ఏడ్చిన ఏడుపు ఏమైందో తెలియదు. కంట్లో ఒక చుక్క కన్నీరైనా రాదు. కొన్ని నిముషాలు వేటూరిని చూస్తూ శిలైపోయాను. "మదికే అతిథిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనో?" అని ఆయన మాటలతోనే అడుగాలనిపించింది. ఇకపైన వేటూరి కలంనుంచి ఇంకో కొత్తా పాట వినే భాగ్యం ఈ తెలుగు దౌర్భాగ్యులకు లేదు. 

చిత్రం : సఖి
 
ప్రేమలే నేరమ ప్రియా ప్రియా
వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు, మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో!

పల్లవి

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు.
మదికే అతి
థిగ రానేలనో;
సెలవైనా అడగక పోనేలనో.
ఎదురుచూపుకు నిదరేది;
ఊగెను ఉసురే కన్నీరై.
మనసు అడిగిన ఆ మనిషెక్కడో;
నా పిలుపే అందని దూరాలలో!


చరణం 1

అనురాగానికి స్వరమేది?
సాగరఘోషకు పెదవేది?
ఎవరికివారే ఎదురుపడి -
ఎదలు రగులు ఎడబాటులలో.
చివరికి దారే మెలికపడి -
నిను చేరగ నేనీ శిలనైతిని!
ఎండమావిలో నావనులే -
ఈ నిట్టూర్పే నా తెరచాపలే!


చరణం 2

వెన్నెల మండిన వేదనలో,
కలువ పువ్వులా కలతపడి.
చేసిన బాసలు కలలైపోతే -
బ్రతుకే మాయగ మిగులుననీ.
నీకై వెతికా కౌగిలినై -
నీడగ మారిన వలపులతో.
అలిసి ఉన్నాను ఆశలతో -
నను ఓదార్చే నీ పిలుపెన్నడో!


ఒరిజినల్ తమిళ సినిమాలో ఈ పాట వైరముత్తు గారు 1984లో రాసిన ఒక ఛందోబద్ధమైన పద్యం. ఆ తరువాయి ఈ కవిత "తేన్ వందు పాయుదు" అన్న కవితల ఆడియో ఆల్బంలో  వైరముత్తుగారి కంఠస్వరంలో, సుహాసిని మణిరత్నం ముందుమాట కంఠస్వరంతో , రహ్మాన్ గారి నేపద్య సంగీతంలో ఆడియో రూపంలో ఎంతోమంది తమిళుల్ని ఆకట్టుకుంది. మణిరత్నం చక్కగా తన సినిమాలో (అలైపాయుదే - తెలుగులో "సఖి‌") వాడుకున్నారు. ఎంతగా నచ్చిందో ఏమో మరి ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు రహ్మాన్.

ఈ పాట సినిమాలో అశరీరిగా వస్తుంది. దీనికి తెలుగు వర్షన్ రాసేటప్పుడు మిగతా డబ్బింగు పాటలకు ఉండే లిప్ సింక్ ఇబ్బందులు అసలు లేదు. తమిళ భావాన్ని పక్కకు పెట్టేసి సినిమాలోని సన్నివేశానికి తగిన గొప్ప భావాన్ని ఎంచుకున్నారు వేటూరి గారు. ఒరిజినల్ తమిళ భావానికన్నా తెలుగు వర్షన్‌లోని భావాం చాల గొప్పగా, సినిమా సన్నివేశానికి చాలా దగ్గరగా ఉంది. వేటూరి గారి ప్రతీభను ప్రతి లైన్‌లోను చూడొచ్చు ఈ పాటలో. పాట పాడినవారు స్వర్ణలత గారు. ఆమే ఈ పాటలోని ప్రతి పదాన్ని ఎంతో అనుభవించి పాడారు.

వేటూరి తమిళ భావానికన్నా బాగరాశాడు అంటే మీరు నమ్మరేమో.
అందుకే తమిళ వర్షన్ కి డిట్టొ అనువాదం ఇస్తున్నాను ఇక్కడ.

పల్లవి
ఎవనో ఒరువన్ వాసిక్కిఱాన్ - ఇరుట్టిల్ ఇరుందు నాన్ యాసిక్కిఱేన్
తవం పోల్ ఇరుందు యోసిక్కిఱేన్ - అదై తవణై ముఱైయిల్ నేసిక్కిఱేన్
కేట్టు కేట్టు నాన్ కిఱంగుగిఱేన్ - నాన్ కేట్పదై అవఓ అఱియవిల్లై
కాట్టు మూంగిలిన్ కాదుక్కుళ్ళే - అవన్ ఊదుం రగసియం పురియవిల్లై
 

ఎవడో ఒకడు (వేణువు) వాయించుచున్నాడు - (ఇక్కడ) చీకట్లో నేను యాచించుచున్నాను
తపస్సులా ఉండి యోచించుచున్నాను - దాన్ని(వేణు గానాన్ని) తేపలుతేపలుగా ఆరాదిస్తున్నాను
వింటూనే పారవశ్యం చెదుతున్నాను - నేను వింటున్న సంగతేమో వాడెఱుగడు
ఆ అడవి వెదురు(వేణువు) చెవిలో - వాడు ఉదే రహయం అర్థంకాలేదు!


చరణం 1
పుల్లాంగుళలే పూంగుళలే నీయుం నానుం ఒరు జాతి
ఉళ్ళే ఉఱంగుం ఏక్కత్తిలే ఉనక్కుం ఎనక్కుం సరి పాది
కణ్గళై వరుడుం తేనిసైయిల్ ఎన్ కాలం కవలై మఱందిరుప్పేన్
ఇనిసై మట్టుం ఇల్లై ఎన్ఱాల్ నాన్ ఎన్ఱో ఎన్ఱో ఇఱందిరుప్పేన్


 ఓ పిల్లనగ్రోవీ! నువ్వూ నేనూ ఒకే శ్రేణికి చెందినవారము;
(వేణు గానం)లోపల దాగున్న నిట్టూర్పులో నీకూ నాకు చెరిసగము!
కనులను నిమిరే సంగీతములో సమయాన్నీ, బాధల్నీ మరిచిపోతున్నాను!
ఈ సంగీతము మాత్రం లేనిచో నేనెన్నడో మరణించి ఉంటాను!




చరణం 2
ఉఱక్కం ఇల్లా మునిరవిల్ ఎన్ ఉళ్ మనదిల్ ఒరు మాఱుదలా
ఇరక్కం ఇల్లా ఇరవుగళిల్ ఇదు ఎవనో అనుప్పుం ఆఱుదలా
ఎందన్ సోగం తీర్వతఱ్కు ఇదు పోల్ మరుందు పిరిదిల్లైయే
అంద కుళలైప్ పోల్ అళువదఱ్కు అత్తనై కణ్గళ్ ఎనక్కిల్లైయే


నిద్దురలేని రాత్రులలో నా మదిలో ఒక మార్పా
కరుణేలేని రాత్రులకు ఎవరో పంపే ఓదార్పా!
నా శోకం తీరుటకు ఇలాంటి ఔషధము వేరొకటిలేదు
ఆ గ్రోవిలా ఏడ్చుటకు అన్ని కన్నులు నాకు లేవు !


ఒరిజినల్ తమిళ పద్యం వైరముత్తుగారి కంఠస్వరంలో
http://www.youtube.com/watch?v=bzb2ojn5IZc

6 కామెంట్‌లు:

  1. Great, great! innaaLLaki ii blog modaleTTaaru. chaalaa santOsham. vETUri maraNam gurinci prastaavanatO modaleTTaDamtO aa vishayam gurtocci konta baadhaa kaligindi. chivariki aayana paadadhuuLi ayinaa taakagaligaam. antE mana bhaagyam anukOvaali.

    pOsT lO akkaDakkaDaa telugu tappulu konta ibbandi peDutunnaay. gamanincandi.

    vairamuttu paaTa kuuDaa goppagaa undi. renTinii pOlcakapOvaDamE mancidEmO.

    రిప్లయితొలగించండి
  2. చక్కని బ్లాగును మొదలుపెట్టావు సోదరా. నీ ప్రయత్నానికి నాకు చాలా సంతోషం కలిగించింది. వేటూరి వ్రాసిన కొన్ని expressions చాలా లోతుగా ఉన్నాయి:
    అనురాగానికి స్వరమేది? సాగరఘోషకు పెదవేది? ఎదురుచూపుకు నిదరేది?
    ఎండమావిలో నావనులే - ఈ నిట్టూర్పే నా తెరచాపలే!
    వెన్నెల మండిన వేదనలో- కలువ పువ్వులా కలతపడి

    ఇవి వేటూరి గొప్పదనాన్ని తెలిపే ప్రయోగాలు.

    ఇక వైరముత్తు వ్రాసిన పాట కూడా బాగుంది. అది continuity ఉన్న పద్యం. వేటూరి వ్రాసింది పరి-పరి విధాలుగా ఆలోచించే పాట. lip-sync అవసరం లేకపోతే వేటూరి ఎంత బాగా dubbing పాటలు వ్రాయగలరొ చెప్పేందుకు ఈ పాట నిదర్శనం.

    నీ రచనాశైలి గురించి రెండు మాటలు:
    - సాధారణంగా తెలుగువారు వాడని పదాలు వాడావు (పవన-ఉపకారిణి, కందెన) - నాకు బాగా నచ్చింది ఆ విషయం. తమిష్జులలాగా మనం కూడా మన భాషను అభివృద్ధి చేసుకోవాలని పాటుపడితే తెలుగుకు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది.
    - అక్కడక్కడా typos వస్తున్నాయి. సందర్భాన్ని బట్టి అర్థం అవుతున్నాయి. వ్రాయగా వ్రాయగా అవి తగ్గుతాయిలే!
    - చదువర్లను వ్యాసాం మొత్తం చదివేలాగా కూర్చోబెట్టాలి అంటే దానికి వ్యాసంలో ఒక ఆత్మ ఉండాలి, ఒక ఉద్వేగం ఉండాలి. అది బాగా కనిపించింది.
    - రెండు భాషల్లోని సాహిత్యాలను పోల్చి చూడటం ఎప్పుడూ మంచి విషయమే. నీ లాగ రెండు భాషలు తెలిసినవాళ్ళు పూనుకుని అది సాధ్యపడేలాగా చెయ్యడం పాఠకుల అదృష్టం.

    మరిన్ని వ్యాసాలు వ్రాస్తావు అని ఆశిస్తూ
    సందీప్

    రిప్లయితొలగించండి
  3. Chala bagundhi mee blog chadhuvuthunte.manasulo edho theliyani anandam....veturi garini malli malli ila thaluchukuntunte,ayana paatala sahityanni inka bagaa ardham chesukuntunte.....ayana maraninchina sandarbhanni meeru vivaristhunte kanneellu aagaledhu.nijanga ayana leni lotu evarooo theerchalenidhi.Inka boledanni veturi gari patalu mee nundi asisthoo.... mee andhari lane veturi garini abhimaninche
    GayatriSudheer.

    రిప్లయితొలగించండి
  4. చాలా బావుంది. సఖి సినిమాలోనే అలైపొంగెరా గురించి నా ఘోష ఇక్కడ చూడండి వీలుంటే.
    http://kottapali.blogspot.com/2008/02/blog-post_12.html

    రిప్లయితొలగించండి
  5. సంతోషం,బాధ ఒకేసారి తెప్పించారు..

    దయచేసి వీలయినన్ని పాటలతో ఈ ప్రయాణాన్ని కొనసాగించండి...

    రిప్లయితొలగించండి