===================================================
ఈ పోస్ట్
చావా కిరణ్ కి
(ఈ టపా రాయడానికి ప్రేరేపణ ఇచ్చింది చావా కిరణ్ పెట్టిన ఒక Buzz)
===================================================
ఈ పోస్ట్
చావా కిరణ్ కి
(ఈ టపా రాయడానికి ప్రేరేపణ ఇచ్చింది చావా కిరణ్ పెట్టిన ఒక Buzz)
===================================================
మణిరత్నం తీసిన ఇద్దరు సినిమా, వాణిజ్యపరంగా అంత హిట్ కాదు. పాటలు మాత్రం సూపర్ హిట్. సినిమా పాటల్లో సాహిత్యం కావాలనుకునే వాళ్ళకు ఈ సినిమాలో పాటలు నచ్చుతాయి. ఈ సినిమా తమిళంలో తీశారు. 1950 ప్రాంతంలో తమిళనాడు రాజకీయ, సినీపరిశ్రమలలో జరిగిన పరిణామాల ఆధారంగా తీయబడింది.
దర్శకుడికి సాహిత్య అభిరుచి ఎక్కువ. ఇది ఆయన తీసిన సినిమాలలో పాటలు వింటే అర్థం అవుతుంది. ఈ సినిమాలోని ఒక ముఖ్యపాత్ర రచయిత. మరొక పాత్ర నటుడు. మణిరత్నం ఈ సినిమాకు కవితలూ, పాటలూ ఎప్పట్లాగానే కవిరాజు వైరముత్తుగారిచే రాయించారు. తెలుగులో దానిని తలతన్నేవిదంగా రాశారు వేటూరి గారు.
ఈ తమిళ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాటలోని భాష సంగం(2000 years old) నాటి పద్యభాష. ఇందులోని ఏ ఒక్క పదముకూడా ఇంతకు మునుపు వచ్చిన సినిమా పాటలలో కనపడవు.
తెలుగు వర్షన్ లో సాహిత్యం గొప్పగా ఉందా లేక తమిళ వర్షన్ లో సాహిత్యం గొప్పగా ఉందా అనికాకుండ రెండిట్లోను సాహిత్యం గొప్పగానే ఉంది అన్నది నా భావన...
చిత్రం : ఇద్దరు
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : ఏ.ఆర్. రహ్మాన్
కంఠస్వరం : ఉన్నికృష్ణన్, బి.జయశ్రీ
పల్లవి :
అతడు :
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా?
(తమిళం)
నఱుముగైయే నఱుముగైయే నీయొరు నాళిగై నిల్లాయ్
సెంగని ఊఱియ వాయ్ తిఱందు నీయొరు తిరుమొళి సొల్లాయ్
అట్రైత్ తింగళ్ అన్నిలవిల్ నెట్రిత్ తరళ నీర్ వడియ కొట్రప్ పొయ్‌గై ఆడియవళ్ నీయా?
పరిమళించే మొగ్గ పోలిన దానా నువ్వొక గడియ ఆగుము
కెంపుఫలములూరిన నోరు విప్పి నువ్వొక శుభవార్త చెప్పు
అలజాబిలి వెన్నెలలో నుదుట ముత్యాల్లా నీరుజారగ తటాకమున జలకాలాడినది నీవా?
(నాళిగై - గడియ - 24 నిముషాలు; 60 గడియలు ఒక రోజు. తింగళ్ - జాబిలి )

ఆమె :
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా?
(తమిళం)
తిరుమగనే తిరుమగనే నీయొరు నాళిగై పారాయ్
వెణ్ణిఱ పురవియిల్ వందవనే వేల్విళి మొళిగళ్ కేళాయ్
అట్రైత్ తింగళ్ అన్నిలవిల్ కొట్రప్పొయ్గై ఆడుగైయిల్ ఒట్రైప్పార్వై పార్తవనుం నీయా?
శ్రీమంతుడా శ్రీమంతుడా నువ్వొక గడియ చూడవోయ్
తెల్లటి గుఱ్ఱంలో వచ్చినవాడా, ఈటెకన్నులుగల నా పలుకులు వినవోయ్
అలజాబిలి వెన్నెలలో తటాకంలో నే జలకాలాడుతుండగ ఒక్క చూపు విసిరినది నీవా?

చరణం 1
అతడు : మదన మోహిని చూపులోన మాండు రాగమేల?
ఆమె : పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా?
అతడు : అలా ఇలా మేఘ మాసం క్షణానికో తోడి రాగం!
ఆమె : చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే!
ఆమె : పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా?
అతడు : అలా ఇలా మేఘ మాసం క్షణానికో తోడి రాగం!
ఆమె : చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే!
తమిళ చరణం 1
అతడు : మంగై మాన్విళి అంబుగళ్ ఎన్ మార్బుళైత్తదెన్న?
(మగువ 'లేడి' కన్నుల బాణాలు/తూపులు నా రొమ్ముచీల్చుతున్నదేమిటి)
ఆమె : పాండి నాడనై కణ్డు ఎన్ ఉడల్ పసలై కొండదెన్న?
(పాండియదేశరాకుమారుని చూసిన నా తనును విరహము చెందెనేల?)
అతడు : నిలావిలే పార్త వణ్ణం కనావిలే తోండ్రుం ఇన్నుం!
(నాడు వెన్నెలలో చూసిన నీ రూపం, కనులలోనే మెదిలే నేడు)
ఆమె : ఇళైత్తేన్ తుడిత్తేన్ పొఱుక్కవిల్లై. ఇడైయిల్ మేగలై ఇఱుక్కవిల్లై!
(నీకై (విరహంతో) చికిపోయాను, విలవిలపోయాను, ఓర్చుకోలేకపోతున్నాను.
నీ విరహంలో నేనెంతగా చిక్కిపోయానంటే తొడిగిన ఒడ్డాణము కూడా వదులైపోయినది. నడుమున నిలబడడం లేదు)

చరణం 2
ఆమె : నెయ్యం వియ్యం ఏధేనైన తనువు నిలువదేలా?
(నెయ్యము -వలపు; వియ్యము - వైవాహిక సంబంధం; ఏధ-ఎదుగుదల
మన వలపు కళ్యాణంవరకు ఎదిగినది, అయినా ఈ తనువు ఆగదెందుకు? - తప్పతే తెలియచేయండి)
అతడు : నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా?
ఆమె : ఒకే ఒక చైత్ర వీణ పురేవిడి పూతలాయే!
అతడు : అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే!

ఆమె : యాయుం జ్ఞాయుం యారాగియరో నెంజు నేర్న్‌దదెన్న?
(మీ కన్నవారికీ, నా కన్నవారికీ ఏ బంధుత్వమూలేదు; అయినా మన ఎదలలో ఏం జరిగింది?)
అతడు : యానుం నీయుం ఎవ్వళి అఱిదుం ఉఱవు సేరందదెన్న?
(నేనూ నీవూ వేర్వేరు స్థాయి వారమని తెలిసీ మన వలపెలా కుదిరింది?)
ఆమె : ఒరే ఒరు తీణ్డల్ సెయ్దాయ్ ఉయిర్ కొడి పూత్తదెన్న?
(నీ ఒకేయొక స్పర్షతో నా ప్రాణలత పూసిందెలా?)
అతడు : సెంబులం సేరంద నీర్తుళి పోల్ అంబుడై నెంజం కలందదెన్న?
(ఎర్రమట్టి భూమిలో పడిన నీట్చుక్కలా ప్రేమించే మనసులు కలిసిందెలా?)

రెండవ తమిళ చరణం లో మూడవ లైన్ మినహా, మిగతావి 2000 వేల సంవత్సరాల క్రితం రాయబడిన కుఱుందొగైలోని పద్యం లో నుండి అలానే వాడుకున్నారు.
= = = X X X = = =
తెలుగు వర్షన్‌ని ఇక్కడ వినండిhttp://www.youtube.com/watch?v=QlbdOEbzzwA
తమిళ వర్షన్‌ని ఇక్కడ వినండి
http://www.youtube.com/watch?v=joJHN_VfY88
aahaa..ilaa vaaraanikO rachana chEstuu unDanDi. bhEsh bhEsh.
రిప్లయితొలగించండి#Some questions#:
1. gucchettETi anTE? vicchandaalu anTE vicchE andaalaa?
2. చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే! - tamiLa bhaavam kannaa konchem bhaavukata ekkuva kanipistOndi. ayitE, karigE vaDDaaNam kaTini gillaDam EnTO artham kaalEdu.
3. renDO caraNam lO konni tappulu unnaayEmO anipincindi -
నెయ్యం వియ్యం "ఏదేdainaa" తనువు నిలువదేలా
ఒకే ఒక చైత్ర " vELa purE" విడి పూతలాయే
@ఫణీంద్ర
రిప్లయితొలగించండిప్రియురాలు, ప్రియుడు కూడిన సమయంలో వారి వేడి ఉపిరికి ఆమె వడ్డాణం కరిగిపోతోందిట (అటూ, ఇటూ జరిగిపోతోంది). అది గిల్లుతున్నట్టుగా వర్ణించారు వేటూరి అని నా అభిప్రాయము.
@ Phanindra :
రిప్లయితొలగించండిరెండో చరణంలో మీరు చెప్పిన తప్పులను దిద్దాను.
"గుచ్చేత్తేటి" అని మహానుభావుడు ఏ అర్థంలో రాశాడో నిజంగా నాకూ తెలియదు. అయితే నాకు ఇందులో రెండు భావాలు ఉన్నట్టు అనిపిస్తుంది. గుచ్ఛము/గుచ్చము అనగా పూవు. గుచ్చు/గిచ్చు అనగా గిల్లు.
ఒకటి, పువ్వుల మీదకు వాలేముందు తుమ్మెద కొంతసమయం పువ్వుమీదే రివ్వుమని తిరిగి ఆ తరువాయి వాలుతుంది పువ్వుమీదకి. అలా తిరిగే దృశ్యం మనోహరంగా ఉంటుంది. అటువంటి మనోహరమైన కులుకులొలికే సౌందర్యము నీదా?
రెండు, నా తనువంతా గిచ్చి గిచ్చి తూట్లుపెట్టేటువంటి గొప్ప కులుకుసంపదగలదానివా?
విచ్చందాలు - వికసించిన పువ్వుపోలిన అందాలు
కరిగే మేఖల కటిని ఎందుకు గిల్లిందో 'సండీప్' చెప్పేశాడు.
Beautiful song..
రిప్లయితొలగించండిథ్యాంక్స్ గిరిష్ గారు :-)
రిప్లయితొలగించండిగుచ్చెత్తడం అంటే పోగుపడడం/గుట్టపొయ్యడం. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో బాగా వాడుకలోనే ఉండేది ఈ మాట.
రిప్లయితొలగించండి