వేటూరి చివరిగా పాటలు రాసిన చిత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన విలన్(రావణన్).
పాటల
విషయానికొస్తే, వీళ్ళు హరివిల్లుల? అమ్మాయిలా? అని జనం నివ్వెరబోయే
స్టెల్లా మేరీస్ కళాశాల అమ్మాయిలు అడుగడుగునా కనబడే 'కథీడ్రల్ రోడ్డు'లో
కారులో వెళుతూ రాసినా, కేర్ హాస్పిటల్ లో మరణశయ్యపై పడుకుని యమపాశాన్ని
చూస్తూ రాసినా ఆయన పాటలోని ఊపు ఏ మాత్రమూ తగ్గదు. డబ్బింగ్ చిత్రానికి
పాటలు రాసేటప్పుడు ఎదురయ్యే రొటీన్ కష్టాలు ఈ పాటకూ తప్పలేదు. కొన్ని తమిళ
భావాలూ/పదాలూ అలానే తీసుకుని తనదైన శైలీలో వేటురి గారు రాసిన పాట ఇది.
రహ్మాన్ ఖాతాలో చోటుచేసుకున్న మరో మంచి మెలోడి ట్యూన్. తమిళానికి
వైరముత్తు, హిందీకి గుల్జార్ లు రాశారు. హింది వర్షన్ లో సాహిత్యం ఎలా
ఉందో నాకు తెలియదు. అయితే తమిళ వర్షన్ కి ఏమాత్రమూ తగ్గకుండ ఒక parallel
lyric రాశారు వేటూరి గారు.
చిత్రం : విలన్ ౨౦౧౦
గాయకులు : అనురాధా శ్రీరాం, నరేష్ అయ్యర్
సంగీతం : ఏ ఆర్ రహ్మాన్
రచన : వేటూరి
పల్లవి
కానల చిలక కానల చిలక ఏ కాన చిలక ఇది
చినుకౌతుందో? పిడుగౌతుందో? మాయమైపోతుందో!
కులుకుమని మెరుపొస్తే - వస్తే
ఉలికిపడి నేనుంటే - ఉంటే
ఎందుకో చెప్పగరాని తప్పుడు వాంఛ కలిగినదే
అది పెట్టిన ఎర్రనిబొట్టది, నా గుండెకు గుచ్చుకుపోయెనే...
కొస చూపుకు ఎముకలు పొడిపొడి ఆయెనే
ఏవరో ఎవరో ఈ చిలకెవరో ఎక్కడి చిలక ఇది
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో
కాలికి సిరులు గాలికి కురులు కన్నలోకమే సై సై
తుమ్మెదలంటని కమ్మని మోమును కన్న వనాలే హాయ్ హాయ్
చరణం 1
పరువాలపాపిటిలో తిరిగాను ఒంటరిగా
అధరాల కనుమలలో పడికొట్టుకుంటున్నా
ఎటూపోని మనసు గురిసడలి విరహముతో పొగలినది
కొండంతబరువు, గుండె చెరువు, ఓ నత్తగుల్ల బతుకు ఇది
ఎర్రని మడమ ముక్కు సొగసు పిచ్చివాణ్ణిచేసి నవ్వుతున్నవి
చరణం 2
నాగేటి సాలులలో సాగేటి నీరనుకో
నీగీటుదాటని నా మనసంత నీదనుకో
పొరుగింటి సొగసు చూసి మనసు కాస్త గట్టు దాటి పోయినది
ఓలమ్మొ ఇది తప్పో, లేక ఒప్పో - లోన కత్తిపోరు సాగుతున్నది
నన్ను నిలబెట్టి విడగొట్టి చెడ్డ విధి వెర్రిగా నవ్వింది
======================================
తమిళ పాట - తెలుగు అనువాదము - తెలుగు పాట:
======================================
కాట్టుచ్ చిఱుక్కి కాట్టుచ్ చిఱుక్కి యార్ కాట్టుచ్ చిఱుక్కి ఇవ?
మళై కొడుప్పాళో? ఇడి ఇడిప్పాళో? మాయమాయ్ పోవాళో?
ఆడవి పోరి అడవిపోరి ఎవరి అడవి పోరి ఇది?
వర్షం ఇస్తుందో? ఉరుములా ఉరుముతుందో? లేక మాయమై పోతుందా?
కానల చిలక కానల చిలక ఏ కాన చిలక ఇది (విన సొంపుగా ఉన్నది తెలుగు వర్షన్ పల్లవే)
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో
ఈక్కి మిన్నల్ అడిక్కుదడి యాత్తే
ఈరక్కొల తుడిక్కుదడి యాత్తే
పుల్ల మెరుపు మెరిసెనే - అమ్మో
కాలేయం అల్లాడెనులే - అమ్మో
కులుకుమని మెరుపొస్తే - వస్తే (భావం అదే; పదప్రయోగం వేరే)
ఉలికిపడి నేనుంటే - ఉంటే (భావం అదే; పదప్రయోగం వేరే)
నచ్చుమనం మచ్చినియోడు మచ్చినియోడు మరుగుదడి
అవ నెత్తియిల్ వచ్చ పొట్టుల ఎన్ నెంజాంకుళియే ఒట్టుదే
అవ పార్వైయిల్ ఎలుంబుగ పల్పొడి ఆచ్చే
విషపూరిత మనసు మరదలుతోటి మరదలితోటి సోలుతున్నదిలే
దాని నుదుట పెట్టిన బొట్టులో నా గుండెకాయే అంటుకున్నదిలే
దాని చూపులో ఎముకలు దంతపొడి అయ్యనే (ఇక్కడ వైరముత్తు భావమే గొప్పగా ఉన్నది)
ఎందుకో చెప్పగరాని తప్పుడు వాంఛ కలిగినదే (కొత్త భావము)
అది పెట్టిన ఎర్రనిబొట్టది, నా గుండెకు గుచ్చుకుపోయెనే (భావం అదే; పదప్రయోగం వేరే)
కొస చూపుకు ఎముకలు పొడిపొడి ఆయెనే
యారో ఎవళో యారో ఎవళో యార్ కాట్టుచ్ చిఱుక్కి ఇవ?
మళై కొడుప్పాళో? ఇడి ఇడిప్పాళో? మాయమాయ్ పోవాళో?
ఎవరో ఎవతో ఎవరో ఎవతో ఎవరి అడవి పోరి ఇది?
వర్షం ఇస్తుందో? ఉరుములా ఉరుముతుందో? లేక మాయమై పోతుందా?
ఏవరో ఎవరో ఈ చిలకెవరో ఎక్కడి చిలక ఇది
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో
తండై అణింజవ కొండై సరింజదుం అండసరాసరం పోచ్చు
వండు తొడాముగం కండు వనాందరం వాంగుదే పెరుమూచ్చు
అందెలు తొడిగినమగువ కొప్పు జారగ అండబ్రహ్మాండము కూలెను
తుమ్మెదతాకని (పువ్వుపోలిన) ముఖము చూసి వనాంతరం నిట్టూర్చెను
కాలికి సిరులు గాలికి కురులు కన్నలోకమే సై సై (మిత్రులెవరైనా ఈ లైన్ కి అర్థము చెప్తే బాగుండు)
తుమ్మెదలంటని కమ్మని మోమును కన్న వనాలే హాయ్ హాయ్ (భావం అదే; పదప్రయోగం వేరే)
చరణం 1
ఉచ్చందల వగిడు వళి ఒత్త మనం అలైయుదడి
ఒదట్టువరి పళ్ళత్తుల ఉసిరు విళుందు తవిక్కుదడి
పాళాప్పోన మనసు పసియెడుత్తు కొణ్డ పత్తియత్త ముఱిక్కుదడి
నుదుటి పాపిటదారిలో ఏకాకిలా (నా) మనసు తిరుగుతున్నది
అదరమదతలోని(lip-wrinkle) పల్లములో (నా) ప్రాణం పడి అలమటిస్తున్నది
పాశిన మనసు ఆకలిగొని పూనిన పథ్యాన్ని మరిచెనులే
పరువాలపాపిటిలో తిరిగాను ఒంటరిగా (భావం అదే; పదప్రయోగం వేరే)
అధరాల కనుమలలో పడికొట్టుకుంటున్నా (భావం అదే; పదప్రయోగం వేరే)
ఎటూపోని మనసు గురిసడలి విరహముతో పొగలినది (కొత్త భావము)
పాఱాంగల్ల సుమందు వళి మఱందు ఒరు నత్తక్కుట్టి నగరుదడి
కెణ్డక్కాలు సెవప్పుం మూక్కు వనప్పుం ఎన్నక్ కిఱుక్కును సిరిక్కుదడి
బండరాయిని మోస్తూ దారితప్పి ఒక నత్తపిల్ల పాకుతున్నది
(నీ)పిక్కల ఎఱుపూ ముక్కు సొగసూ నన్ను పిచ్చోడని నువ్వుతున్నాయి
కొండంతబరువు, గుండె చెరువు ఓ నత్తగుల్ల బతుకు ఇది (వినుచుండగా తెలుగు భావమో ఇంపుగా/గొప్పగా ఉన్నది)
ఎర్రని మడమ ముక్కు సొగసు పిచ్చివాణ్ణిచేసి నవ్వుతున్నవి (వినుచుండగా తెలుగు భావమో ఇంపుగా/గొప్పగా ఉన్నది)
చరణం 2
ఏర్ కిళిచ్చ తడత్తు వళి నీర్ కిళిచ్చు పోవదు పోల్ (Typical వైరముత్తు భావం)
నీ కిళిచ్చ కోట్టు వళి నీళుదడి ఎంపొళప్పు
నాగలి గీసిన సాలులో నీరు దూసుకెళ్ళినట్టు
నువ్వు గీసిన గీటులో సాగెను నాబ్రతుకు
నాగేటి సాలులలో సాగేటి నీరనుకో
నీగీటుదాటని నా మనసంత నీదనుకో
ఊరాన్ కాట్టు కనియే ఒన్న నెనచ్చు నెంజు సప్పుక్కొట్టిత్ తుడిక్కుదడి
యాత్తే ఇదు సరియా ఇల్ల తవఱా నెంజిల్ కత్తిచ్ సణ్డై నడక్కుదడి
ఒన్న మున్న నిఱుత్తి ఎన్న నడత్తి కెట్ట విది వందు సిరిక్కుదడి(ఈ లైన్ లు తమిళంలో బావున్నాయి)
పరాయివారి అడవిఫలమా నిన్ను తలచి మది లొట్టెలేసి తపించెనే
అమ్మో ఇది ధర్మమో అధర్మమో తెలియక మదిలో కత్తి యుద్ధము జరిగుతున్నది
నిన్ను ముందునిలిపించి నన్ను (నీవైపు) నడిపించి కుళ్ళిన విధి నవ్వుతున్నది
పొరుగింటి సొగసు చూసి మనసు కాస్త గట్టు దాటి పోయినది (భావమూ; ప్రయోగమూ వేరే)
ఓలమ్మొ ఇది తప్పో, లేక ఒప్పో - లోన కత్తిపోరు సాగుతున్నది
నన్ను నిలబెట్టి విడగొట్టి చెడ్డ విధి వెర్రిగా నవ్వింది
తమిళ చిత్రం : రావణన్
తమిళ గాయకులు : అనురాధా శ్రీరాం, శంకర్ మహాదేవన్
సంగీతం : ఏ ఆర్ రహ్మాన్
తమిళ రచన : వైరముత్తు
--------------------------------------
RTS format lO telugu lyrics
--------------------------------------
citraM : vilan / villain
gaayakulu : anuraadhaa SrIraaM, narEsh ayyar
saMgItaM : A R rahmaan
racana : vETUri
pallavi
kaanala cilaka kaanala cilaka E kaana cilaka idi
cinukautuMdO piDugautuMdO maayamaipOtuMdO
kulukumani merupostE - vastE
ulikipaDi nEnuMTE - uMTE
eMdukO ceppagaraani tappuDu vaaMCha kaliginadE
adi peTTina erraniboTTadi, naa guMDeku guccukupOyenE...
kosa cUpuku emukalu poDipoDi aayenE
EvarO evarO I cilakevarO ekkaDi cilaka idi
cinukautuMdO piDugautuMdO maayamaipOtuMdO
kaaliki sirulu gaaliki kurulu kannalOkamE sai sai
tummedalaMTani kammani mOmunu kanna vanaalE haay haay
caraNaM 1
paruvaalapaapiTilO tirigaanu oMTarigaa
adharaala kanumalalO paDikoTTukuMTunnaa
eTUpOni manasu gurisaDali virahamutO pogalinadi
koMDaMtabaruvu guMDe ceruvu O nattagulla batuku idi
errani maDama mukku sogasu piccivaaNNicEsi navvutunnavi
caraNaM 2
naagETi saalulalO saagETi nIranukO
nIgITudaaTani naa manasaMta nIdanukO
porugiMTi sogasu cUsi manasu kaasta gaTTu daaTi pOyinadi
Olammo idi tappO, lEka oppO - lOna kattipOru saagutunnadi
nannu nilabeTTi viDagoTTi ceDDa vidhi verrigaa navviMdi
ఝుమ్మంది నాదం :: jhummandi nAdaM "వేటూరి" చలనచిత్ర సాహిత్యము
tamiL-telugu comparison లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
tamiL-telugu comparison లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
17 అక్టోబర్ 2010
02 సెప్టెంబర్ 2010
మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!
22 మే 2010, శనివారం రాత్రి సమయం పదయింది. ఆషాకి ఒంట్లో బాగలేదు. డక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకుని, నిద్రపట్టక టీవీ చూస్తుంది. నేను కంప్యూటర్లో పాటలు వింటున్నాను. ఆష గట్టిగా పిలిచింది. ఏమైందో ఏమోనని కంగారుతో వెళితే,
"వేటూరి చనిపోయారంట! ఫ్లాష్ న్యూస్ వస్తోంది" ఆష హీనస్వరంలో చెప్పింది!
అలాగే కిందకు వాలిపోయాను. మాటలు రావడంలేదు. ఇది కల అయితే బాగుండు. నన్నెవరన్నా ఇప్పుడు నిద్రలేపేయండి అని అరవాలనిపించింది! టీవీకేసి చూస్తున్నాను గాని ఆ ఫ్లాష్ న్యూస్ అక్షరాలు కనపడడంలేదు. కన్నులు కమ్మేశాయి. మరో ఛానల్ మార్చింది. అందులోనూ అదే న్యూస్ చదువుతున్నారు. కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంటర్నెట్లో మిత్రులనడిగాను. వారూ అదే వార్తతో బాధపడుతున్నారు.
వేటూరి చనిపోవడం ఏంటి? అసలు అది సాధ్యమా? రాలిపోని పువ్వనుకున్నాను వేటూరిని.
నాకు కాలం స్తంబించింది. కందెన లేకుంటే భూచక్రం ఎలా తిరుగుతుంది? కన్నీళ్ళతోబాటు ఆలోచనలూ అల్లుకుపోతున్నాయ్! ఇందాకకూడా పాట వింటూ వేటూరికి ఒక శభాష్ చెప్పానే, అయితే నా ఈ "శభాష్"ని అందుకోలేదా అయన? అంతకుముందు "చుక్కూళ్ళోకెక్కినాడు చక్కనోడు..." పాటవింటున్నప్పుడే ఆయణ ప్రాణం పోయుంటుందా? నాలో కన్నీళ్ళూ, ప్రశ్నలూ, ఆలోచనలూ పౌర్ణమి రేయి సాగరతీరంలా ఇంకా ఇంకా పెర్గుతున్నాయ్!
"నువ్వు హైదరబాదుకు వెళ్ళి చూసిరా" ఆష చెప్పింది.
"నీకు బాగలేనప్పుడు ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళను?"
"నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళి చివరిసారిగా చూసిరా. తెల్లవారికి టిక్కేట్లు ఉన్నాయా చూడు" అని ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చింది ఆష.
నా అధృష్టం. ఒకే ఒక 8:45 ఫ్లైట్లో మాత్రం తిక్కెట్లు ఉన్నాయ్. మోహన్‌కి ఫోన్ చేసి చెప్పాను. తనూ వస్తానన్నాడు. రెండు తిక్కెట్లు బుక్ చేశాను. ఆషాకు బాగలేదు, ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి అన్న బాధ, ఇంక కొత్తగా వేటూరి పాటలు ఏవీ రావ్వు అన్న బాధ - అసలు నిద్ర రాలేదు. మనసంతా ఆయన రాసిన విషాద గీతాలు మెదలుతున్నాయ్.
నా చుట్టూ ప్రపంచం నిద్రపోతుంది. నేను మాత్రం మరణాన్నీ, వేటూరినీ నిందిస్తున్నాను! ఆయన భాషలోనే
"వేటూరి చనిపోయారంట! ఫ్లాష్ న్యూస్ వస్తోంది" ఆష హీనస్వరంలో చెప్పింది!
అలాగే కిందకు వాలిపోయాను. మాటలు రావడంలేదు. ఇది కల అయితే బాగుండు. నన్నెవరన్నా ఇప్పుడు నిద్రలేపేయండి అని అరవాలనిపించింది! టీవీకేసి చూస్తున్నాను గాని ఆ ఫ్లాష్ న్యూస్ అక్షరాలు కనపడడంలేదు. కన్నులు కమ్మేశాయి. మరో ఛానల్ మార్చింది. అందులోనూ అదే న్యూస్ చదువుతున్నారు. కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంటర్నెట్లో మిత్రులనడిగాను. వారూ అదే వార్తతో బాధపడుతున్నారు.
వేటూరి చనిపోవడం ఏంటి? అసలు అది సాధ్యమా? రాలిపోని పువ్వనుకున్నాను వేటూరిని.
నాకు కాలం స్తంబించింది. కందెన లేకుంటే భూచక్రం ఎలా తిరుగుతుంది? కన్నీళ్ళతోబాటు ఆలోచనలూ అల్లుకుపోతున్నాయ్! ఇందాకకూడా పాట వింటూ వేటూరికి ఒక శభాష్ చెప్పానే, అయితే నా ఈ "శభాష్"ని అందుకోలేదా అయన? అంతకుముందు "చుక్కూళ్ళోకెక్కినాడు చక్కనోడు..." పాటవింటున్నప్పుడే ఆయణ ప్రాణం పోయుంటుందా? నాలో కన్నీళ్ళూ, ప్రశ్నలూ, ఆలోచనలూ పౌర్ణమి రేయి సాగరతీరంలా ఇంకా ఇంకా పెర్గుతున్నాయ్!
"నువ్వు హైదరబాదుకు వెళ్ళి చూసిరా" ఆష చెప్పింది.
"నీకు బాగలేనప్పుడు ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళను?"
"నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళి చివరిసారిగా చూసిరా. తెల్లవారికి టిక్కేట్లు ఉన్నాయా చూడు" అని ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చింది ఆష.
నా అధృష్టం. ఒకే ఒక 8:45 ఫ్లైట్లో మాత్రం తిక్కెట్లు ఉన్నాయ్. మోహన్‌కి ఫోన్ చేసి చెప్పాను. తనూ వస్తానన్నాడు. రెండు తిక్కెట్లు బుక్ చేశాను. ఆషాకు బాగలేదు, ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి అన్న బాధ, ఇంక కొత్తగా వేటూరి పాటలు ఏవీ రావ్వు అన్న బాధ - అసలు నిద్ర రాలేదు. మనసంతా ఆయన రాసిన విషాద గీతాలు మెదలుతున్నాయ్.
నా చుట్టూ ప్రపంచం నిద్రపోతుంది. నేను మాత్రం మరణాన్నీ, వేటూరినీ నిందిస్తున్నాను! ఆయన భాషలోనే
మదికే అతిధిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనో
ఎదురుచూపుకు నిదరేది - ఊగెను ఉసురే కన్నీరై;
మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!
ఆకలీ, నిద్ర ప్రేమలోపడ్డవారికేకాదు వియోగంలో ఉన్నవారికి కూడా ఉండవేమో. తెల్లవారి అద్ధంలో మొహం చూస్కుంటే నాకే నేను అన్యుడిలా కనపడుతున్నాను. హోసూరుకెళ్ళి మోహన్‌ని పిక్కప్ చేసుకున్నాను. మాకు ఏం మాట్లాడుకోవాలో తోచలేదు. మౌనంగా రెండుగంటల్లో airport చేరుకున్నాము. కిటికీనుంచి ఆకాశానికేసి చూస్తున్నాను, చనిపోయిన వేటూరి గారు కూడ తారలా మారుంటాడేమోనని. వేటూరి తారగా మారడం ఏంటి? ఆయన తేజోవంతుడు; సూర్యుడౌతాడు గాని, తారకాడు! హైదరబాదులో దిగి, ఆయన నివాసం వెతికి చేరుకున్నాము. ఆయన భౌతికకాయం చూడగానే అంతవరకు ఏడ్చిన ఏడుపు ఏమైందో తెలియదు. కంట్లో ఒక చుక్క కన్నీరైనా రాదు. కొన్ని నిముషాలు వేటూరిని చూస్తూ శిలైపోయాను. "మదికే అతిథిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనో?" అని ఆయన మాటలతోనే అడుగాలనిపించింది. ఇకపైన వేటూరి కలంనుంచి ఇంకో కొత్తా పాట వినే భాగ్యం ఈ తెలుగు దౌర్భాగ్యులకు లేదు.
చిత్రం : సఖి
ప్రేమలే నేరమ ప్రియా ప్రియా
వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు, మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో!
పల్లవి
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు.
మదికే అతిథిగ రానేలనో;
సెలవైనా అడగక పోనేలనో.
ఎదురుచూపుకు నిదరేది;
ఊగెను ఉసురే కన్నీరై.
మనసు అడిగిన ఆ మనిషెక్కడో;
నా పిలుపే అందని దూరాలలో!
చరణం 1
అనురాగానికి స్వరమేది?
సాగరఘోషకు పెదవేది?
ఎవరికివారే ఎదురుపడి -
ఎదలు రగులు ఎడబాటులలో.
చివరికి దారే మెలికపడి -
నిను చేరగ నేనీ శిలనైతిని!
ఎండమావిలో నావనులే -
ఈ నిట్టూర్పే నా తెరచాపలే!
చరణం 2
వెన్నెల మండిన వేదనలో,
కలువ పువ్వులా కలతపడి.
చేసిన బాసలు కలలైపోతే -
బ్రతుకే మాయగ మిగులుననీ.
నీకై వెతికా కౌగిలినై -
నీడగ మారిన వలపులతో.
అలిసి ఉన్నాను ఆశలతో -
నను ఓదార్చే నీ పిలుపెన్నడో!
ఒరిజినల్ తమిళ సినిమాలో ఈ పాట వైరముత్తు గారు 1984లో రాసిన ఒక ఛందోబద్ధమైన పద్యం. ఆ తరువాయి ఈ కవిత "తేన్ వందు పాయుదు" అన్న కవితల ఆడియో ఆల్బంలో వైరముత్తుగారి కంఠస్వరంలో, సుహాసిని మణిరత్నం ముందుమాట కంఠస్వరంతో , రహ్మాన్ గారి నేపద్య సంగీతంలో ఆడియో రూపంలో ఎంతోమంది తమిళుల్ని ఆకట్టుకుంది. మణిరత్నం చక్కగా తన సినిమాలో (అలైపాయుదే - తెలుగులో "సఖి") వాడుకున్నారు. ఎంతగా నచ్చిందో ఏమో మరి ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు రహ్మాన్.
ఈ పాట సినిమాలో అశరీరిగా వస్తుంది. దీనికి తెలుగు వర్షన్ రాసేటప్పుడు మిగతా డబ్బింగు పాటలకు ఉండే లిప్ సింక్ ఇబ్బందులు అసలు లేదు. తమిళ భావాన్ని పక్కకు పెట్టేసి సినిమాలోని సన్నివేశానికి తగిన గొప్ప భావాన్ని ఎంచుకున్నారు వేటూరి గారు. ఒరిజినల్ తమిళ భావానికన్నా తెలుగు వర్షన్‌లోని భావాం చాల గొప్పగా, సినిమా సన్నివేశానికి చాలా దగ్గరగా ఉంది. వేటూరి గారి ప్రతీభను ప్రతి లైన్‌లోను చూడొచ్చు ఈ పాటలో. పాట పాడినవారు స్వర్ణలత గారు. ఆమే ఈ పాటలోని ప్రతి పదాన్ని ఎంతో అనుభవించి పాడారు.
వేటూరి తమిళ భావానికన్నా బాగరాశాడు అంటే మీరు నమ్మరేమో.
అందుకే తమిళ వర్షన్ కి డిట్టొ అనువాదం ఇస్తున్నాను ఇక్కడ.
పల్లవి
ఎవనో ఒరువన్ వాసిక్కిఱాన్ - ఇరుట్టిల్ ఇరుందు నాన్ యాసిక్కిఱేన్తవం పోల్ ఇరుందు యోసిక్కిఱేన్ - అదై తవణై ముఱైయిల్ నేసిక్కిఱేన్
కేట్టు కేట్టు నాన్ కిఱంగుగిఱేన్ - నాన్ కేట్పదై అవఓ అఱియవిల్లై
కాట్టు మూంగిలిన్ కాదుక్కుళ్ళే - అవన్ ఊదుం రగసియం పురియవిల్లై
ఎవడో ఒకడు (వేణువు) వాయించుచున్నాడు - (ఇక్కడ) చీకట్లో నేను యాచించుచున్నాను
తపస్సులా ఉండి యోచించుచున్నాను - దాన్ని(వేణు గానాన్ని) తేపలుతేపలుగా ఆరాదిస్తున్నాను
వింటూనే పారవశ్యం చెదుతున్నాను - నేను వింటున్న సంగతేమో వాడెఱుగడు
ఆ అడవి వెదురు(వేణువు) చెవిలో - వాడు ఉదే రహయం అర్థంకాలేదు!
చరణం 1
పుల్లాంగుళలే పూంగుళలే నీయుం నానుం ఒరు జాతి
ఉళ్ళే ఉఱంగుం ఏక్కత్తిలే ఉనక్కుం ఎనక్కుం సరి పాది
కణ్గళై వరుడుం తేనిసైయిల్ ఎన్ కాలం కవలై మఱందిరుప్పేన్
ఇనిసై మట్టుం ఇల్లై ఎన్ఱాల్ నాన్ ఎన్ఱో ఎన్ఱో ఇఱందిరుప్పేన్
ఓ పిల్లనగ్రోవీ! నువ్వూ నేనూ ఒకే శ్రేణికి చెందినవారము;
(వేణు గానం)లోపల దాగున్న నిట్టూర్పులో నీకూ నాకు చెరిసగము!
కనులను నిమిరే సంగీతములో సమయాన్నీ, బాధల్నీ మరిచిపోతున్నాను!
ఈ సంగీతము మాత్రం లేనిచో నేనెన్నడో మరణించి ఉంటాను!
చరణం 2
ఉఱక్కం ఇల్లా మునిరవిల్ ఎన్ ఉళ్ మనదిల్ ఒరు మాఱుదలా
ఇరక్కం ఇల్లా ఇరవుగళిల్ ఇదు ఎవనో అనుప్పుం ఆఱుదలా
ఎందన్ సోగం తీర్వతఱ్కు ఇదు పోల్ మరుందు పిరిదిల్లైయే
అంద కుళలైప్ పోల్ అళువదఱ్కు అత్తనై కణ్గళ్ ఎనక్కిల్లైయే
నిద్దురలేని రాత్రులలో నా మదిలో ఒక మార్పా
కరుణేలేని రాత్రులకు ఎవరో పంపే ఓదార్పా!
నా శోకం తీరుటకు ఇలాంటి ఔషధము వేరొకటిలేదు
ఆ గ్రోవిలా ఏడ్చుటకు అన్ని కన్నులు నాకు లేవు !
ఒరిజినల్ తమిళ పద్యం వైరముత్తుగారి కంఠస్వరంలో
http://www.youtube.com/watch?v=bzb2ojn5IZc
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)