07 అక్టోబర్ 2011

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో...


తెలుగుతనం నిండిన పాట. వేటూరి రాయగా చక్రవర్తి గారు స్వరపరచినది. బాలు, సుశీల గార్ల గళంలో అమృత వర్షమే! మనసు పులకొస్తుంది నాకు ఈ పాటలోని సాహిత్యం వుంటుంటే..

పల్లవి
అతడు :  
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

ఆమె :
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

చరణం 1
అతడు :
ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం

ఆమె :
అ గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలొ ఉదయరాగ సిందూరం
అతడు : ప్రేమే పెన్నిధిగా ఆమె : దైవం సన్నిధిగా 
సమశ్రుతిలో జతకలిసి
ఆమె :
ప్రియలయలొ అదమరచి
అనురాగాలు పలికించు వేళ

చరణం 2
ఆమె :
 అందమైన మన యిల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు
అతడు :
తెలవారిన సంజెలలొ తేనెనీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలొ కరుగుతున్న కన్నీళ్ళు
  ఆమె : ఒకటే ఊపిరిగా అతడు : కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
అతడు :
మమతలనే మధువొలికె
శుభయోగాలు తిలకించు వేళ


========================
ఇక్కడ వినండి
========================
 
ఇక్కడ వీక్షించండి


======================================================
చిత్రం / Movie : కొండవీటి సింహం /konDaveeTi simham
సాహిత్యం / Lyrics : వేటూరి / vETUri
గళం / Singers : బాలు, సుశీల / bAlu, suSeela
సంగీత్రం / Music : చక్రవర్తి / chakravati
======================================================
In RTS format -

pallavi
ataDu :
ee madhumAsaMlO ee darahAsaMlO
madilO kadili palikE kOyila
bratukE hAyigA

Ame :
ee madhumAsaMlO ee darahAsaMlO
madilO kadili palikE kOyila
bratukE hAyigA

charaNaM 1
ataDu :
AkASaM aMchulu dATE AvESaM nA geetaM
aMdulOni prati aksharamu aMdamaina nakshatraM
Ame :
A geetaM palikina nA jeevitamE saMgeetaM
saMgamiMchu praNayaMlo udayarAga siMdUraM

ataDu : prEmE pennidhigA
Ame : daivaM sannidhigA

ataDu : samaSrutilO jatakalisi

Ame :
priyalayalo adamarachi

anurAgAlu palikiMchu vELa


charaNaM 2
Ame :
aMdamaina mana yillu avani meeda harivillu
Rtuvulenni mArinA vasaMtAlu vedajallu

ataDu :
telavArina saMjelalo tEneneeTi vaDagaLLu
j~nApakAla neeDalalo karugutunna kanneeLLu

Ame : okaTE UpirigA
ataDu : kalalE chUpulugA

Ame :
manasulalO manaserigi

ataDu :
mamatalanE madhuvolike
SubhayOgAlu tilakiMchu vELa

=============================================

3 కామెంట్‌లు:

  1. నాకు ఇష్టమైన సుశీల గారి వందల పాటల్లో ఇదీ ఒకటి. పాట గురించి మీ వ్యాఖ్యానం వెదికి, దొరక్క చాలా నిరాశపడిపోయాను. రాయాల్సింది కదా!
    ఈ సైట్‌లో మేము చూడాలనుకునేది కేవలం సాహిత్యం మాత్రమే కాదు, దానికి సంబంధించిన కొన్ని మంచి వివరాలో, లేదా...అది మీలో కలుగజేసిన స్పందనో....

    రిప్లయితొలగించండి
  2. emayi poyarandi inni rojulu... indulo chaala patala saahityam gurinchi vivaritaru ani veyi kallatho eudru chustu unnamu .
    mee nundni veturi gurinchi marinnni posts raavalani asistu....

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత గారూ,
    మీ అభిమానానికి ధన్యోస్మి :-) కుదిరితే వేటూరి గారి సాహిత్యమంతా ఇక్కడపెట్టేసి వాటికి నాకు తెలిసిన వివరణ రాసేయాలనే ఉంది. వ్యవధి లేక రాయలేకున్నాను. ఇంతకీ మీ పేరే ఊరూ చెప్పలేదు.

    రిప్లయితొలగించండి